ETV Bharat / offbeat

నోరూరించే 'క్యారెట్ పచ్చడి' - పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు! - CARROT PACHADI IN TELUGU

క్యారెట్​తో ఆరోగ్యానికి ఎంతో మేలు - సులభంగా పచ్చడి పెట్టేయండి

How to Make Carrot Chutney
How to Make Carrot Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 5:45 PM IST

How to Make Carrot Chutney : క్యారెట్​ అనగానే మనలో చాలా మంది ఉదయం లేదా సాయంత్రం తినే ఒక ఆరోగ్యకరమైన స్నాక్​గానే చూస్తారు. క్యారెట్​లో ఉండే విటమిన్ ఎ, కె, సి వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి ట్రై చేసే వారు క్యారెట్జ్యూస్​ చేసుకుని తాగుతుంటారు.

క్యారెట్​తో కర్రీ వండుకోవడం లేదా రెండు క్యారెట్లను ముక్కలుగా కోసి సాంబార్​లో వేసుకోవడం ఎక్కువ మంది వంటింట్లో చేసేదే! అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా క్యారెట్ పచ్చడి ట్రై చేయండి. ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పినట్లుగా క్యారెట్ పచ్చడి పెడితే సూపర్​ టేస్టీగా ఉంటుంది. పైగా ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా క్యారెట్ పచ్చడి ఎలా చేయాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • క్యారెట్​ - పావు కేజీ

స్పెషల్​ పొడి కోసం :

  • మెంతులు - అరటీస్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • పచ్చిశనగపప్పు - అరటీస్పూన్
  • మినప్పప్పు - అరటీస్పూన్
  • ఎండుమిర్చి - 4
  • పచ్చిమిర్చి - 3
  • ఇంగువ - చిటికెడు
  • కొత్తమీర తరుగు - కొద్దిగా
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత

తాలింపు కోసం :

  • ఆవాలు - అరటీస్పూన్​
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఎండుమిర్చి -1
  • కరివేపాకు - 2

తయారీ విధానం :

  • ముందుగా క్యారెట్​ శుభ్రంగా కడిగి ఒక పొడి వస్త్రంతో తుడవండి. ఆపై గ్రేటర్​ సహాయంతో తురుముకోండి.
  • క్యారెట్​ తురుముని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్​ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు వేసి వేపండి. మెంతులు ఎర్రగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేపండి.
  • పచ్చిశనగపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి కాసేపు ఫ్రై చేయండి. తర్వాత స్టవ్​ ఆఫ్ చేసి ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, చింతపండు వేసి కలపండి.
  • తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • తర్వాత ఒక పాన్​లో ఆయిల్​ వేసి కాస్త నూనె వేసి వేడి చేయండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపండి.
  • అనంతరం క్యారెట్​ తురుము, గ్రైండ్​ చేసుకున్న స్పెషల్​ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి.
  • ఓ 5 నిమిషాల తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి అరగంటపాటు అలా వదిలేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ అండ్​ హెల్దీ క్యారెట్​ పచ్చడి మీ ముందుంటుంది.
  • ఈ క్యారెట్​ పచ్చడి అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోశల్లోకి కూడా టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • క్యారెట్​ పచ్చడి నచ్చితే మీరు ఓ సారి ట్రై చేయండి.

పక్కా కొలతలతో 'చికెన్ పచ్చడి' ఇలా పెట్టండి - 3 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు!

క్రిస్పీ ఓట్స్ మసాలా వడలు - సింపుల్​ టిప్స్​తో సూపర్ టేస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.