LIVE: విజయవాడలో చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM Chandrababu Tour On JCB - CM CHANDRABABU TOUR ON JCB
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2024, 10:25 PM IST
|Updated : Sep 4, 2024, 10:48 PM IST
Chandrababu Live : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాలుగో రోజు పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని సూచించారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, కేజీ చక్కెర అందించాలని సీఎం ఆదేశించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని సీఎం వివరించారు. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలని తేల్చిచెప్పారు. అన్ని అంబులెన్స్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయడంతో పాటు శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలని అధికారులను ఆదేశించారు.
Last Updated : Sep 4, 2024, 10:48 PM IST