ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పార్థసారథి - ప్రత్యక్షప్రసారం - CM Chandrababu Press Meet Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 4:35 PM IST

Updated : Sep 18, 2024, 5:08 PM IST

CM Chandrababu Press Meet Live: సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న మద్యం ధరను 99 నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణంయించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది. వాలంటీర్లు వ్యవస్థపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్చితో ముగిసిన కాలపరిమితి గత ప్రభుత్వం రెన్యూవల్‌ చేయకపోగా చాలామందితో వైసీపీ రాజీనామా చేయించిందనే అంశంపై చర్చ నడిచింది.  వరదలు అధిక వర్షాల వల్ల పంట నష్టపరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని మంత్రివర్గ నిర్ణయించింది. వరద ముంపు సాయం కూడా అద్దెకు ఉండేవారు ఉంటే వారికే పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటి యజమానులు కాకుండా అద్దెకు ఉంటూ సామాన్లు పాడైన బాధితుల్ని గుర్తించి ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Sep 18, 2024, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details