Pawan Kalyan in Tamil Nadu Tour: ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్, మధురై జిల్లా అళగర్ కొండల్లో కొలువైన అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు పవన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. పవన్ కల్యాణ్ మురుగన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో పాల్గొన్నారు. మురుగన్ దర్శనానంతరం ఆలయంలోని పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని వారితో సెల్ఫీలు దిగారు. కొందరికి ఆర్థిక సాయం చేశారు. పవన్‌తో పాటు అతని కుమారుడు అకీరా నందన్ స్వామివారిని దర్శించుకున్నారు.
తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటన - కుంభకోణంలోని పలు క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు