ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : వరద సాయంపై ముఖ్యమంత్రి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - CM Press Meeting on Floods - CM PRESS MEETING ON FLOODS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 7:39 PM IST

Updated : Sep 17, 2024, 8:32 PM IST

CM Chandrababu Press Meet About Flood Victims Help : వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం అంచనాపై అధికారులతో సీఎం ఇప్పటికే పలు మార్లు చర్చించారు. వరద బాధితులకు సహాయంలో భాగంగా సీఎంఆర్​ఎఫ్​కు భారీగా విరాళాలు అందాయి. వరదల నుంచి ప్రజలను బయటపడేయాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కనబరిచిన పని తీరుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబుతో సహా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులందరూ వరదలోనే ఉండి బాధితులకు సేవలందించారు. వరదలు వచ్చినప్పటి నుంచి పరిస్థితులు సాధారణమయ్యే వరకు బాధితులకు ఆహారం, పాలు, బిస్కెట్లు అందించింది ప్రభుత్వం. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశార. వరద బాధితులందరికీ  నష్ట పరిహారం అందిస్తామని వెల్లడించారు. వరద బాధితులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపిన సీఎం వరదల సాయం పై సమీక్ష నిర్వహించారు. మీ కోసం ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Sep 17, 2024, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details