ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: జాతీయ విద్యా దినోత్సవం వేడుకల్లో సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 6:22 PM IST

Updated : Nov 11, 2024, 8:26 PM IST

CM Chandrababu in National Education Day Celebrations: దేశ తొలి విద్యాశాఖ మంత్రి సయ్యద్ గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్ధీన్ అల్ హుస్సేనీ ( మౌలానా అబుల్ కలాం ఆజాద్) జన్మదినం పురస్కరించుకుని పాఠశాలల్లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నారు. విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్ అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. "మౌలానా అబుల్‌ కలాం ఆజాద్ బహుభాష పండితుడు, కోవిదుడు. ఆయన కుటుంబం కాందీశీక కుటుంబం కాగా, ఇక్కడే స్థిరపడి భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఆజాద్ అనే కలంతో అనేక రచనలు చేశారు. ఆయన చేసిన తొలి వృత్తి పాత్రికేయ వృత్తి" అని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. భారత సంగ్రామంలో గాంధీజీతో కలిసి నడిచి పిన్న వయస్సులో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి అనేక ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఏ కన్వెన్షన్​లో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Nov 11, 2024, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details