ETV Bharat / state

పీ-4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతాం: సీఎం చంద్రబాబు - CHANDRABABU ON P4 POLICY

నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన - నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో 3 గ్రామాల నేతలతో సమావేశం

CM Chandrababu on Organic Farming
CM Chandrababu on Organic Farming (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2025, 7:46 PM IST

Updated : Jan 14, 2025, 9:45 PM IST

Chandrababu on P4 Policy : పీ-4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె, ఎ.రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన చర్చించారు. కృత్రిమ మేధను అందరూ అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రతి పల్లె, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని చంద్రబాబు తెలిపారు. ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో మనది ఒకటని చెప్పారు. విదేశాలకు వెళ్లిన వారిలో తెలుగువారి తలసరి ఆదాయమే ఎక్కువని పేర్కొన్నారు. విజన్‌ 2047 తయారుచేసి ముందుకెళ్తున్నామని హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనేవే తమ లక్ష్యాలని వివరించారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. పింఛన్లకు ఏటా రూ.33,000ల కోట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు తెలియజేశారు.

"దేశంలో అత్యధిక పింఛన్ ఇచ్చే రాష్ట్రం మనదే. 199 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం. పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ సరఫరాకు శ్రీకారం చుట్టాం. వివిధ వర్గాలకు పెండింగ్‌లో ఉన్న రూ.6,700 కోట్లు విడుదల చేశాం. 4.56 లక్షల మంది ధాన్యం రైతులకు డబ్బు చెల్లించాం. ఇటీవల ప్రధాని వచ్చి రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సాయం వల్లే చాలామంది చదువుకున్నారు. కొందరు కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. గ్రామాల్లో పేదలుగా ఉండిపోయిన వారికి మార్గదర్శనం చేయాలి." - చంద్రబాబు, సీఎం

'పేదల జీవితాల్లో వెలుగుల కోసమే పీ-4 విధానానికి పిలుపునిచ్చాం. రాష్ట్రంలోని ప్రజలందరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెరగాలి. మనదేశానికి జనాభే పెద్ద సంపద కాబోతుంది. జనాభా తగ్గిపోయి జపాన్‌, జర్మనీ, దక్షిణకొరియా ఇబ్బంది పడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఒక్కరు ఐటీ నిపుణుడు కావాలని గతంలో పిలుపునిచ్చాను. ప్రతి ఇంటి నుంచీ ఒక పారిశ్రామికవేత్త రావాలి. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఏఐలో నైపుణ్యం సాధించాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

"రంగంపేట పాఠశాలను శ్రీసిటీ ద్వారా అభివృద్ధి చేస్తాం. హంద్రీనీవా నీటిని కల్యాణ్ డ్యాంకి తీసుకువస్తాం. భవిష్యత్​లో సాగునీటి సమస్య లేకుండా చూస్తాం. కోలార్‌లో టీసీఎస్‌ చేసినట్లు ఆరోగ్య కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. రూపాయి అవినీతి లేకుండా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. రైతులకు ఎప్పటికప్పుడు ధాన్యం డబ్బు చెల్లిస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి." - చంద్రబాబు, సీఎం

'రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రపంచదేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. వ్యవసాయ సాగు విధానంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. సేంద్రీయ సాగుకు నేనే శ్రీకారం చుట్టాను. మైక్రో ఇరిగేషన్​ను మరింత ప్రోత్సహిస్తాం. పశువుల గడ్డి సాగు క్షేత్రాలను పెంచుతాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్​ ఇస్తున్నాం. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగిందని' చంద్రబాబు వివరించారు

Chandrababu on Organic Farming : చిరుధాన్యాల పంటసాగు పెరుగుతోందని చంద్రబాబు తెలిపారు. డ్రోన్ల ద్వారా చీడపీడలను గుర్తించే సాంకేతికత వచ్చిందన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారు. అందరూ హార్టికల్చర్​కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పాడిపరిశ్రమకు షెడ్లు నిర్మిస్తామని అన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామికీకరణ చేస్తామని వివరించారు. భవిష్యత్​లో సెల్​ఫోన్‍ ఒక ఆయుధంలా పనిచేస్తుందని తెలియజేశారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత వినియోగిస్తామని సీఎం వెల్లడించారు.

స్వగ్రామంలో బిజీబిజీగా సీఎం చంద్రబాబు - పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

పీ-4 విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వండి: సీఎం చంద్రబాబు

Last Updated : Jan 14, 2025, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.