ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: వరద బాధితులకు ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - Financial Package to Flood Victims - FINANCIAL PACKAGE TO FLOOD VICTIMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 11:31 AM IST

Updated : Sep 25, 2024, 12:36 PM IST

CM Chandrababu Giving Financial Package to Flood Victims Live: రాష్ట్రంలో ఆగస్టు - సెప్టెంబర్​లో వచ్చిన భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇస్తుంది. విజయవాడ పరిధిలో లక్షన్నర మంది బాధితులకు వరద సాయం కింద ఆర్థిక ప్యాకేజీ అందించనుంది. బాధితులకు ఆర్థిక సాయం కింద దాదాపు రూ. 597 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు ప్రభుత్వం మించి ఆర్థిక సాయం అందిస్తోంది. ముంపు ప్రాంతాల్లో రూ. 180 కోట్ల మేర బ్యాంక్ రుణాల రీ-షెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్​లో ఎవరికీ ప్యాకేజీ అందక పోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్​లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజీ అందిస్తున్నారు. 
Last Updated : Sep 25, 2024, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details