ETV Bharat / state

రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాల్లో క్యూఆర్‌ కోడ్‌ - ఎందుకోసమంటే? - QR CODE SURVEY IN AP TEMPLES

దేవాదాయశాఖ ఆలయ దర్శనంపై సర్వే కార్యక్రమం - భక్తుల అభిప్రాయానికి ప్రాధాన్యం

QR Code Survey in AP Temples
QR Code Survey in AP Temples (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 2:02 PM IST

QR Code Survey in AP Temples : ఆలయాలకు వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు దేవాదాయశాఖ ప్రత్యేక సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీలోని 7 ప్రధాన దేవాలయాలు అన్నవరం, సింహాచలం, విజయవాడ, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలంలలో క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా కేటాయించిన ఈ కోడ్‌లను ప్రాంగణాల్లో పలుచోట్ల ప్రదర్శించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. భక్తులు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి దర్శన అనుభవం ఎలా ఉంది, మౌలిక వసతులు, తాగునీరు, వాష్‌రూమ్‌ తదితరాలపై అభిప్రాయం నమోదు చేయవచ్చు. తర్వాత పేరు, ఫోన్‌ నంబర నమోదు చేసి సబ్మిట్‌ చేయాలి. దీంట్లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

పాత ఒప్పందాలు రద్దు! - ఇకపై అన్ని ఆలయాల్లో ఆ నెయ్యినే వాడాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.