ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 10:28 PM IST

ETV Bharat / videos

ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలిక- చివరకు ఏమైందంటే?

Child Fell Into Borewell in Krishna District:  ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో తవ్వుకున్న బోరుబావిలో బాలిక ప్రమాదవశాత్తు పడిన (Child Fell Into Borewell) ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఆ బాలిక ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో 12 సంవత్సరాల బాలిక ఆడుకుంటూ ఇంటికోసం తవ్విన బోరు బావిలో పడిపోయింది. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.  ఆ పాపను యటకు తీయడానికి గ్రామస్థులు తీవ్రంగా కృషి చేశారు.

గ్రామంలోని ఇంటి యజమాని ఇంటి ప్రహరీ నిర్మాణం కోసం తీసిన బోరులోబావి తవ్వాడు. ఆ బోరు ఖాళీ ప్రదేసంలో ఉండటంతో బాలిక ఆడుకుంటూ వెళ్లి చూసుకోకుండా అందులో పడిపోయింది. గమనించిన గ్రామస్థులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థుల సాయంతో  జేసీబీతో సమాంతరంగా ఓ పెద్ద గొయ్యిని తవ్వి కొన్ని గంటల పాటు శ్రమించి చిన్నారిని బయటకు తీశారు. బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అంబులెన్సులో  స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

ABOUT THE AUTHOR

...view details