ETV Bharat / state

సైబర్​ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం ఎందుకు 'గోల్డెన్ అవర్' గురించి తెలుసుకోండి - CYBER ​​FRAUDS IN TELANGANA

సైబర్​ క్రైంలో గోల్డెన్​ అవర్ - సైబర్​ నేరం జరిగిన మొదటి గంట సమయమే గోల్డెన్​ అవర్ - మొదటి గంటలోపు ఫిర్యాదు చేస్తే పూర్తి డబ్బు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న పోలీసులు

Cyber ​​Frauds in Telangana
Cyber ​​Frauds in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 12:48 PM IST

Cyber ​​Frauds in Telangana : ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించగలిగితే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతారు. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి మొదలయ్యే మొదటి గంట సమయాన్ని వైద్య భాషలో గోల్డెన్​ అవర్​ అంటారు. ఇప్పుడు ఇదే సూత్రం సైబర్​ నేరాలకు కూడా సైబర్​ నిపుణులు, పోలీసులు వర్తిస్తున్నారు. సైబర్​ నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే సైబర్​ నేరగాళ్లు దోచుకున్న సొమ్మునంతా తిరిగి ఇప్పిస్తారు. ఇప్పుడు ఆ గంట సమయం బాధితుడికి రక్షణగా ఉంటుందని, సైబర్​ నేరం జరిగిన గంటలోనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ గోల్డెన్​ అవర్​ గురించి ప్రాచుర్యత కల్పిస్తున్నారు.

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్​లో సైబర్​ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రూ.1500 కోట్లను సైబర్​కేటుగాళ్లు కొట్టేశారు. అంటే సగటున నెలకు రూ.150 కోట్లన్న మాట. వీరి బారిన విద్యావంతులు, ఉన్నతాధికారులు, చివరకు పోలీసులూ పడ్డారు. ఈ ఆన్​లైన్​ మోసాలు ఎలా ఉంటున్నాయంటే ఒక తరహా నేరంపై అవగాహన పెరిగే సరికి మరో తరహాలో దాడి జరుగుతుంది. అందుకే పోలీసులు సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒకవేళ నేరగాళ్ల బారిన పడితే ఎలా స్పందించాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Increasing Cyber ​​Crimes Telangana : ఆలస్యం అవుతున్న కొద్దీ కొల్లగొట్టిన నగదు దారి మళ్లించే అవకాశాలు పెరిగిపోతాయి. అందుకే నేరం జరిగిన మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే నిలిపివేసి, తిరిగి బాధితుడికి చెల్లించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలో దాదాపు రూ.100 కోట్ల వరకు ఇలానే తిరిగి ఇప్పించగలిగారు.

ఎలా చేయాలి? ఏం జరుగుతుంది?

  • సైబర్​ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్​ సైబర్​ క్రైం కో-ఆర్డినేషన్​ సెంటర్ (ఐ4సీ)​ను ప్రారంభించింది.
  • ఇందులో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలను భాగస్వామ్యం చేసింది.
  • బాధితులు ఫిర్యాదు చేసేందుకు దేశవ్యాప్తంగా పని చేసేలా 1930తో ఒక టోల్​ఫ్రీ నంబరును కేటాయించారు.
  • ఈ నంబరుకు ఫోన్​ చేసిన వెంటనే కాల్​ సెంటర్​లోని ఉద్యోగులు బాధితుడి వివరాలు నమోదు చేసుకుంటారు.
  • అంటే బ్యాంకు ఖాతా నంబరు, మోసం చేసేందుకు నేరస్థుడు వాడిన ఫోన్​ నంబరు, మోసం జరిగిన తీరుపై సమాచారాన్ని సేకరిస్తారు.
  • సాధారణంగా కేటుగాళ్లు బ్యాంకు ఖాతా నుంచి కొల్లగొట్టిన డబ్బును మరో బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సొంత ఖాతాలో జమ చేస్తే చిరునామా తెలిసిపోతుందన్న ఉద్దేశంతో బినామీ ఖాతాలను ఉపయోగిస్తారు.
  • నిరక్షరాస్యులు, నిరుద్యోగులకు డబ్బుల ఆశ చూపించి వారి ఖాతాలను వాడుకుంటారు. మళ్లీ వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి మళ్లించి, ఏటీఎంల ద్వారా డ్రా చేసుకుంటారు.
  • లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతుంటారు. ఇటీవల ఒక వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కొల్లగొట్టిన నిందితులు గంట వ్యవధిలోనే ఆ మొత్తాన్ని దాదాపు 200 ఖాతాల్లోకి మళ్లించారు. కొన్ని ఖాతాలు కేరళలో ఉంటే మరికొన్ని కశ్మీర్​లో ఉంటాయి.
  • ఫిర్యాదు ఆలస్యం అయితే ఈ ఖాతాల సంఖ్య పెరుగుతూ పోతుంది.
  • 1930కి బాధితుడు ఫిర్యాదు చేస్తే ముందుగా అతని ఖాతా ఉన్న బ్యాంకునకు సమాచారం చేరవేస్తారు. ఆ ఖాతా నుంచి నగదు బదిలీని ఆపమని కోరతారు.
  • అప్పటికే ఒకవేళ బదిలీ జరిగినట్లు అయితే ఆ డబ్బు ఏ ఖాతాలో పడిందో తెలుసుకొని ఆ బ్యాంకును అప్రమత్తం చేస్తారు. ఇలా ఎన్ని ఖాతాలకు డబ్బులు పడి ఉంటే అన్ని ఖాతాల బ్యాంకులకు సమాచారం ఇస్తారు.
  • అప్పటికి డబ్బు ఖాతాలోనే ఉంటే తిరిగి రప్పిస్తారు.

ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు :

  • ఇటీవల కాలంలో హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తిని స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్​ నేరగాళ్లు రూ.1,22,26,205 కొల్లగొట్టారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తక్షణమే స్పందించిన పోలీసులు బ్యాంకు లావాదేవీలు నిలిపివేయడం ద్వారా రూ.1,05,00,000 కాపాడారు. అప్పటికే నేరస్థుడు దాదాపు రూ.17 లక్షలను మళ్లించాడు.
  • ఇంకో కేసులోనూ ఇలానే సైబర్​ నేరగాళ్లు అధిక లాభాలు ఆశ చూపించి ఒకేసారి రూ.11,55,000లను కొల్లగొట్టారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే డబ్బంతా తిరిగి ఇప్పించారు.

మీకూ ఇలాంటి ​కాల్ వచ్చిందా? - ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం!

సైబర్​ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం చేస్తే మొదటికే మోసం - పోలీసులు ఏం చెప్తున్నారంటే! - CYBER CRIMES rcoverie percentage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.