ఉండవల్లిలో చంద్రబాబు దంపతుల రాజశ్యామల యాగం - రాజశ్యామల యాగం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 3:24 PM IST
Chandrababu Rajashyamala Yagam: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం చేపట్టారు. ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న ఈ యాగం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు.
ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. రుత్వికల వేద మంత్రోచ్ఛరణల మధ్య యాగం నిర్వహిస్తున్న ప్రాంతం పూర్తిగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రత్యేకంగా కొన్ని యాగాలు జరిపించిన ఆంశం విదితమే. శత చండియాగంతో పాటు, మహా సుదర్శన యాగం చేపట్టిన విషయం తెలిసిందే. రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయమని శ్యామలా దేవిని ప్రసన్నం చేసుకుంటారని వేద పండితులు వివరిస్తున్నారు.