ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సభా వేదికపై చంద్రబాబు, పవన్‌ - పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం - Pawan and Chandrababu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 7:17 PM IST

Updated : Feb 28, 2024, 9:33 PM IST

TDP Janasena Tadepalligudem Meeting: తెలుగుదేశం - జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇరు పార్టీల నేతలు స్టేజ్ పంచుకోవడంతో సభా ప్రాంగణం అంతా టీడీపీ - జనసేన జెండాలతో నిండిపోయింది. తాడేపల్లిగూడెం సభా వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి వచ్చారు.  పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.  పరస్పరం పార్టీ జెండాలు మార్చుకుని ఊపిన చంద్రబాబు, పవన్‌ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు. టీడీపీ-జనసేన జెండాల రెపరెపలతో  సభా ప్రాంగణం కళకళలాడింది. అనంతరం సభా వేదికపై ఉన్న ఇరుపార్టీల నేతలతో చంద్రబాబు, పవన్‌ కరచాలనం చేశారు.  

ఉమ్మడి సభకు సుమారు 7 లక్షల మంది హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోవటంతో వేలాదిమంది అభిమానులు జాతీయ రహదారిపై నుంచే వీక్షిస్తున్నారు. తాడేపల్లిగూడెం - తణుకు మధ్య జాతీయ రహదారి స్తంభించిపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నాగబాబులు తాడేపల్లిగూడెం సభలో పాల్గొన్నారు. ఇరు పార్టీల అధినేతలు సభ ప్రాంగణంపైకి వస్తూనే రెండు పార్టీల జెండాలను ఒక్కరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు.

Last Updated : Feb 28, 2024, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details