ETV Bharat / state

ఆ 362 విద్యార్థులకు ఏమైంది - పరీక్ష ఫీజు ఎందుకు చెల్లించలేదు? - NOT PAYING SSC EXAM FEE IN AP

డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పదోతరగతి పరీక్ష రుసుము చెల్లించని 362 మంది

SSC Exam Fee Payment Issue in AP
SSC Exam Fee Payment Issue in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2024, 12:06 PM IST

Not Paying SSC Exam Fee in AP : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు కట్టే గడువు ముగిసింది. అపరాధ రుసుము రూ.500లతో కూడా ఈ నెల 16కి ముగిసిపోయింది. కానీ డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వివిధ పాఠశాలల్లో పదో తరగతిలో ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 362 మంది ఎగ్జామ్స్​ రాయడానికి ఫీజు కట్టలేదు. ఇందులో 122 మంది బాలికలు, 240 మంది బాలురు ఉన్నారు.

వాస్తవానికి వీరంతా మార్చి నెలలో జరిగే పదో తరగతి పరీక్షలు రాయాలి. రుసుము గడువు తీరేటప్పటికి జిల్లాలో 143 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 362 మంది ఫీజు చెల్లించలేదు. అంటే వారు పరీక్ష రాయడానికి రావడం లేదు. వాస్తవానికి సెప్టెంబర్ 29నాటికి ఈ పాఠశాలల్లో 5031 మంది బాలురు, 4628 బాలికలతో మొత్తం 9659 మంది ఉండేవారు. డిసెంబర్​ 18 నాటికి వీరి సంఖ్యలో బాలురు 4791 మంది, బాలికలు 4506 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా 10వ తరగతి వారే.

మరి ఎందుకు ఈ తేడా వచ్చింది. వారి పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయులు ఎందుకు చెల్లించలేదని రాష్ట్ర విద్యాశాఖ ఆరా తీస్తోంది. అపుడు నమోదైన వీరందరితోనూ పరీక్ష ఫీజు కట్టించలేకపోవడం తీవ్ర అంశంగా పరిగణిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరి సంఖ్య ఎందుకు తగ్గిందో, వారి ఫీజు ఎందుకు కట్టలేదో సరైన కారణాలు చెబుతూ ప్రధానోపాధ్యాయులు ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఆయా పాఠశాలలకు తాఖీదులు పంపారు.

మరోవైపు ఇటీవలే పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే సంవత్సరం మార్చి 17 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని తెలిపింది. విద్యార్థులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - మీకు నచ్చిన మీడియం ఎంచుకోవచ్చు

మార్చి 1 నుంచి ఇంటర్​ - 17 నుంచి పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.