Minister Nimmala on Alliance Government Victory on irrigation Elections : రాష్ట్రంలో నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారన్నారు. గత ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్ మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టని వ్యాఖ్యానించారు. గత అయిదు సంవత్సరాల రైతు వ్యతిరేఖ పాలనతో విసుగెత్తిపోయిన రైతులు, జగన్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి గానీ, బలపరిచడానికి గానీ ఏ ఒక్క రైతు ముందుకు రాలేదన్నారు. సాగు నీటి సంఘాల ద్వారా రైతులకు రైతుబిడ్డలే సేవ చేసుకునేలా దాదాపు 60 వేల మందికి సాగు నీటిరంగంలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు.
నిజమైన రైతు ప్రభుత్వం అంటే ఇదే అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. సాగు నీటి పారుదల వ్యవస్ద మరింత బలపడటానికి ఎన్నికైన అన్నదాతలు ఎంతో దోహదపడతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకుందని స్పష్టం చేసారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిస్తే, ఇప్పుడు సాగు నీటిసంఘాల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఏకగ్రీవంగా విజయం సాదించామన్నారు.
సాగునీటి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా - పులివెందులలో ఏకగ్రీవం
రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నా కూడా ప్రభుత్వం ఎన్నికలను ప్రశాతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్దులకు ఇంత భారీ విజయాన్ని అందించడం గొప్ప విషయం అన్నారు. అన్నదాతల విషయంలో ఇది ఆల్ టైం రికార్డ్ అన్నారు. అన్నదాతల అండదండలన్నీ తమ ప్రభుత్వానికే ఉన్నట్లు మరోసారి రుజువైందని తెలిపారు. రైతుల సహకారంతో రాబోయే రోజుల్లో సాగు నీటి రంగాన్ని బలోపేతం చేసి, ప్రతి ఏకరాకు నీరు అందించి రాష్ట్రంలో సిరులపంటలు పండిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
ఘర్షణల మధ్య సాగునీటి సంఘాల ఎన్నికలు - వాగ్వాదంతో కొన్నిచోట్ల వాయిదా
ఒక్క ఐడియా ఆక్వారైతుల సమస్యలు తీర్చింది - పదేళ్లుగా సిరుల పంట