ETV Bharat / state

కరెంట్ కట్ చేసిన అధికారులు - ప్రాణం తీసిన కొవ్వొత్తి - WOMAN DIED IN FIRE ACCIDENT

బకాయి చెల్లించలేదని కరెంటు తొలగించిన విద్యుత్ అధికారులు - కొవ్వొత్తి వెలిగించడంతో ప్రమాదం

WOMAN_DIED_IN_FIRE_ACCIDENT
WOMAN DIED IN FIRE ACCIDENT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

WOMAN DIED IN FIRE ACCIDENT: వాళ్లది నిరుపేద కుటుంబం. ప్రతి రోజూ కూలీకి వెళ్తేనే పొట్టనిండేది. అలాంటిది విద్యుత్తు పాత బకాయిలు చెల్లించలేదంటూ అధికారులు వారి కనెక్షన్‌ తొలగించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చీకటిలో నిద్రించలేక ఆ ఇల్లాలు రాత్రి కొవ్వొత్తిని వెలిగించింది. ఆ కొవ్వొత్తి ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని శామీర్‌పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన ఊదరి భాగ్యమ్మ(40) కూలి పనిచేసేది. ఆమె భర్త యాదగిరి కూరగాయల తోటలకు పందిరి వేస్తాడు. భాగ్యమ్మ, యాదగిరి దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మాయికి పెళ్లికాగా, ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు 6 సంవత్సరాల క్రితం చెరువులో పడి చనిపోయాడు. 15 రోజుల క్రితం భాగ్యమ్మ భర్త యాదగిరి పని నిమిత్తం కరీంనగర్‌ జిల్లాకు వెళ్లాడు.

ప్రమాదం ఎలా జరిగిందంటే: కొంతకాలం క్రితం గతంలోని బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ అధికారులు యాదగిరి ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌ తొలగించారు. అప్పటి నుంచి కొవ్వొత్తి వెలుగులోనే వారు కాలం వెళ్లదీస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి భాగ్యమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, వెలిగించిన కొవ్వొత్తి మంటలు దుప్పటికి అంటుకొని సజీవ దహనమైంది. సమీపంలోని వారెవరికీ ఈ ఘటన గురించి తెలియలేదు. భాగ్యమ్మ అరుపులు వినిపించలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనను స్థానికులు బుధవారం సాయంత్రం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ - తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

నిద్రలోనే అనంతలోకాలకు - చదువు కోసం వెళ్లి కెనడాలో మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.