Suspected Zika Virus Case : ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు వెలుగుచూడటంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. రెండు రోజులుగా స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జికా వైరస్ లక్షణాలతో గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుణె ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి నివేదిక ఇంకా అందలేదు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో, ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి.
మంత్రి ఆదేశించినా .. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించినా అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వైద్య అధికారులైతే ఎక్కడున్నారో తెలియడం లేదంటున్నారు. భయంతో ఉపాధ్యాయులు గ్రామానికి రాకపోవడంతో, ప్రభుత్వ పాఠశాల తెరచుకోలేదు. తమ కుమారుడిని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నెల్లూరు జిల్లాలో 'జికా వైరస్' - గ్రామంలో మెడికల్ క్యాంపు - మంత్రి ఆనం ఏమన్నారంటే!