ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అవినీతిపై కోటప్పకొండలో ప్రమాణానికి సిద్ధమా ? - ఎమ్మెల్యే గోపిరెడ్డికి టీడీపీ సవాల్​ - ఎమ్మెల్యే గోపిరెడ్డి తాజా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 5:37 PM IST

Chadalavada Aravinda Babu Fires On MLA Gopireddy Srinivasa Reddy : నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతిపై కోటప్పకొండలో ప్రమాణానికి సిద్ధమా అని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో చదలవాడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్సీపీ నేతలపై సైతం అనేక అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. గోపిరెడ్డి అవినీతి గురించి వైఎస్సార్సీపీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శిస్తున్నారన్నారు. గోపిరెడ్డి చివరికి రక్తాన్ని పీల్చే జలగలా మారాడని అరవిందబాబు వ్యాఖ్యానించారు. నరసరావుపేటలో 200 ఎకరాల ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే ఆక్రమించుకున్నాడని ఆయన ఆరోపించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుల కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట మున్సిపాలిటీ నుంచి ప్రతి రోజు లక్ష రూపాయలు గోపిరెడ్డి దోచుకుంటున్నారని విమర్శించారు. స్థానికంగా క్రికెట్ బెట్టింగ్ మొత్తం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details