ETV Bharat / offbeat

"రాయలసీమ స్టైల్​ నాటుకోడి వేపుడు" - సంక్రాంతికి ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్​ లెవల్! - RAYALASEEMA NATUKODI FRY

-నోరూరించే నాటుకోడి ఫ్రై -సంక్రాంతి పండగకు సింపుల్​గా ఇలా చేసేయండి!

Rayalaseema NatuKodi Vepudu in Telugu
Rayalaseema NatuKodi Vepudu in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2025, 12:49 PM IST

Rayalaseema NatuKodi Vepudu in Telugu : రాయలసీమ అనగానే మనందరికీ నాటుకోడి పులుసు, రాగి సంగటి గుర్తుకొస్తుంటాయి. కారంగా ఉండే నాటుకోడి కూర రాగి సంగటితో తింటే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ సంక్రాంతికి నాటుకోడి పులుసు కాకుండా ఓసారి ఇలా వేపుడు ట్రై చేయండి. టేస్ట్​ ఎంతో బాగుంటుంది. ఒక్కసారి ఇలా నాటుకోడి ఫ్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా నాటుకోడి వేపుడు ఎలా చేయాలి ? రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ? అనేది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • నాటు కోడి ముక్కలు - అరకేజీ
  • నూనె- అరకప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - రుచికి సరిపడా
  • పసుపు- అర టీ స్పూన్​
  • ధనియాలపొడి -2 టీస్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - టేబుల్​స్పూన్​
  • ధనియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • జాజికాయ పొడి - 2 చిటికెలు
  • దాల్చిన చెక్క - 2 ఇంచ్​లు
  • లవంగాలు - 5
  • యాలకులు -3
  • జీలకర్ర- అర టీ స్పూన్​
  • బిర్యానీ ఆకు- 1
  • మిరియాలు - 10
  • ఎండుమిర్చి-3
  • అనాసపువ్వు - 1
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • పచ్చిమిర్చి - 3
  • కరివేపాకు రెమ్మలు -2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా చికెన్​ శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోండి. ఇలా సాల్ట్​ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ముక్క త్వరగా ఉడుకుతుంది.
  • ఆపై స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, అనాసపువ్వు, జాజికాయ పొడి వేసి మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.
  • కొద్దిసేపటికి వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోండి. ఆ తర్వాత స్టవ్​ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసి గ్రైండ్​ మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్​ పెట్టి ఆయిల్​ వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేపండి.
  • ఆపై ఫ్రెష్​ అల్లం- వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి వేపండి.
  • అనంతరం ధనియాలపొడి, కారం రుచికి సరిపడా వేసి నూనెలో బాగా ఫ్రై చేయండి.
  • ఇప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి వేపండి.
  • ఒక 5 నిమిషాల తర్వాత ఒక నాలుగు గ్లాసుల నీరు పోసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి.
  • ముక్క ఉడికిన తర్వాత గిన్నెపై మూత తీసేసి నీరు ఇగిరిపోయేంత వరకు కలుపుతూ వేపుకోండి.
  • ముక్క క్రిస్పీగా అయిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి రెండు టీస్పూన్లు వేసి మిక్స్​ చేయండి.
  • ఒక 5 నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి కలపండి.
  • ఒక నిమిషం తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి సర్వ్​ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఘుమఘుమలాడే నాటుకోడి వేపుడు మీ ముందుంటుంది.
  • ఈ రాయలసీమ​ నాటుకోడి ఫ్రై మీకు నచ్చితే, ఈ సంక్రాంతికి తప్పక ట్రై చేయండి.

"ఆంధ్రా స్టైల్​ నాటుకోడి బిర్యానీ"- ఈ సంక్రాంతికి మరింత స్పైసీగా!

టేస్టీ అండ్​ స్పైసీ "గార్లిక్​ చికెన్ ఫ్రై" - ఇంట్లో ఇలా చేస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.