ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల సంఘం ఆదేశాలను సీఎం జగన్‌ ధిక్కరించారు: లక్ష్మణరెడ్డి - AP Latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 1:29 PM IST

CFD Hold State Level Kalajata at Bapatla: ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాలను సీఎం జగన్(CM Jagan) ధిక్కరించి వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియ(Volunteers in Election Duty) లో వినియోగించాలని చూస్తున్నారని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆరోపించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ(Citizens for Democracy) ఆధ్వర్యంలో ఓటు వేద్దాం రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమాన్ని బాపట్ల ఎన్జీవో(NGO) హోంలో నిర్వహించారు. 

ఎన్నికల్లో(AP Elections 2024) ప్రతి ఒక్కరూ ఓటు వేసి నిజాయితీపరులైన పాలకులను ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్య పరుస్తూ కళాకారుల బృందం నాటికలు, నృత్యాలు ప్రదర్శించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో(Tirupati By-Elections) 35 వేల దొంగ ఓట్ల(Fake Votes)ను చేర్పించి నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఈసీ(EC) ఆదేశాలను గాలికి వదిలేస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(Electoral Roll Amendment Process)లో వాలంటీర్లు పాల్గొన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details