తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీ విజయం దిశగా కూటమి - చంద్రబాబు నివాసంలో మిన్నంటిన సంబురాలు - TDP WINS IN AP ELECTIONS 2024 - TDP WINS IN AP ELECTIONS 2024

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 5:18 PM IST

Chandrababu Family Celebrations : ఆంధ్రప్రదేశ్​లో కూటమి ఘన విజయంతో, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో సంబురాలు ఘనంగా జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. సంబరాల్లో భాగంగా చంద్రబాబు నాయడుడి కుటుంబంతో పాటుగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలి ఒక్కరినొక్కరు ఆలింగనం చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. లోకేశ్ సైతం ఉత్సాహంగా కనిపించారు. 

కేక్ కట్ చేసిన అనంతరం నారా భువనేశ్వరితో పాటుగా చంద్రబాబుకు లోకేశ్ కేక్ తినిపించారు. ఇక చంద్రబాబు ఇంటి ముందు తెలుగుదేశం అభిమానులు బారులు తీరారు. చంద్రబాబు నాయుడి ఇంటి పరిసరాలు మెుత్తం జై బాబు, సీఎం అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్‌ విలవిల్లాడుతుండగా, ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. కూటమి అభ్యర్థులు జిల్లాలకు జిల్లాలే స్వీప్‌ చేస్తున్న తరుణంలో జగన్‌ మినహా మంత్రులంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details