ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'కూటమి ప్రభుత్వం వచ్చాక ఘంటసాలను హెరిటేజ్‌ గ్రామంగా మారుస్తాం' - Buddha Poornima Celebrations - BUDDHA POORNIMA CELEBRATIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 5:15 PM IST

Buddha Poornima Celebrations at Buddhavihar Krishna District : బుద్ధపూర్ణిమ సందర్భంగా కృష్ణా జిల్లా ఘంటసాల అమరావతి బుద్ధవిహార్‌లో గౌతమ బుద్ధుని జయంతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఘంటసాలను హెరిటేజ్‌ గ్రామంగా మారుస్తామని, శయన బుద్ధ ప్రాజెక్టు మళ్లి ప్రారంభిస్తామన్నారు. ప్రజలంతా ఘంటసాల వైపు చూసేలా చేస్తామన్నారు. శయన బుద్ధ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చిన రంగనాథబాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పర్యటకంగా ఘంటసాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. గతంలో వందల సంఖ్యలో బౌద్ధ బిక్షువులు ఘంటసాల కు వచ్చి బౌద్ధ స్థూపాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారని, అటువంటి రోజులు మరలా వచ్చేవిధంగా కృషి చేస్తామని బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాల బౌద్ధ మ్యూజియంలోని బౌద్ధుని విగ్రహాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రాష్ట్రంలో గొప్ప వారసత్వ గ్రామాలలో ఘంటసాల గ్రామం ఒకటని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details