LIVE : జడ్చర్లలో కేటీఆర్ ప్రెస్‌మీట్ ప్రత్యక్షప్రసారం - KTR PRESS MEET LIVE - KTR PRESS MEET LIVE
Published : Sep 14, 2024, 2:54 PM IST
KTR Press meet live : హామీలు అమలు చేయాలని కోరితే, అధికార కాంగ్రెస్ పార్టీ దాడులకు తెగబడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారన్న ఆయన, హైడ్రా పేరిట హైడ్రామాలకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఎన్ని డైవర్షన్‌లు చేసినా, హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో సీఎం రేవంత్ అన్నారన్న కేటీఆర్, పార్టీ మారానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించినప్పటికీ పీఏసీ ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కోరితే దాడి చేశారని, కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో కనీసం శాంతి భద్రతలు అదుపులో ఉంచలేకపోతున్నారని విమర్శించారు. గూండాలకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి కౌశిక్‌రెడ్డిపై దాడికి పంపారని మాజీ మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.