LIVE: తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం
Published : 4 hours ago
|Updated : 4 hours ago
KTR Press Meet Live : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అదానిపై అమెరికాలో లంచం ఇచ్చారని ఆ దేశం కేసు నమోదు చేసిన నేపథ్యంలో గౌతమ్ అదానితో చేసుకున్న ఓప్పందాలపై కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. రూ. 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద గౌతమ్ అదాని రూ.100 కోట్ల విరాళాన్ని తెలంగాణలో ఏం ఆశించి ఇచ్చారని కీలక ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అదాని ఇచ్చిన కార్పస్ ఫండ్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిన్న సీఎం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండిపడ్డారు. జైలుకు వెళ్లిన వారందరూ సీఎం అవుతున్నారని, కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోదామా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జైలుకెలితే సీఎం అవుతారనుకుంటే ఆ జాబితాలో ముందుగా కవిత సీఎం అవుతారని రేవంత్ రెడ్డి కీలక వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీకి పోటీ తీవ్రంగా ఉందని దుయ్యబట్టారు.గత ప్రభుత్వ హయాంలోనే అదానీ గ్రూపునకు ప్రాజెక్టులు, భూములు అప్పజెప్పారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. BRS పాలనలో ఇచ్చిన కాంట్రాక్టులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అదానీతో ఒప్పందాలను రద్దు చేయాల్సి వస్తే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. అదానీని కేసీఆర్, కేటీఆర్ కలిశారంటూ ఫోటోలను ప్రదర్శించారు. ఈ విషయంపై కేటీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Last Updated : 4 hours ago