తెలంగాణ

telangana

ETV Bharat / videos

బండి సంజయ్ కులాలు, మతాల పేరుతో యువకులను రెచ్చగొడుతున్నారు : వినోద్ కుమార్ - BRS Candidate Vinod Kumar Comments - BRS CANDIDATE VINOD KUMAR COMMENTS

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 10:39 AM IST

BRS Vinod Kumar Fire On Bandi Sanjay : ఎంపీ బండి సంజయ్ కర్మ సిద్ధాంతాన్ని పాటించకుండా ధర్మం కోసమని ఓట్లు అడుగుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. బండి సంజయ్ కులాలు, మతాల పేరుతో యువకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ది కోసం పార్టీతో సంబంధం లేకుండా బీజేపీ మంత్రులను కూడా కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

BRS Vinod Kumar Slams Bandi Sanjay : గత ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ ఎప్పుడూ జిల్లా పరిషత్, మండల పరిషత్ సమావేశాలకు హాజరు కాలేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎలాంటి అభివృద్ధి పనులు చేశానో వివరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ధర్మం కోసం ఎన్నికలు గెలవాల్సిన అవసరం లేదని, ఆశ్రమం పెట్టుకోవచ్చని వినోద్ కుమార్ సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో తాను ఓటు అడుగుతున్నట్లు వినోద్ కుమార్ వివరించారు. ప్రజలు ఈసారి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details