LIVE : పటాన్చెరులో హరీశ్‌రావు మీడియా సమావేశం - HARISH RAO PRESS MEET LIVE - HARISH RAO PRESS MEET LIVE
Published : Jul 17, 2024, 11:39 AM IST
|Updated : Jul 17, 2024, 11:58 AM IST
Harish Rao Press Meet at Patancheru Live : ఆరు గ్యారంటీల పేరిట అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, హామీల అమలులో మాత్రం అనేక షరతులు విధిస్తూ జాప్యం వహిస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని మండిపడ్డారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నాడు సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకు వెళ్లి ఓట్లు కొల్లగొట్టారని, నేడు పోలీసులను పంపించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని మాజీమంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థులు, అభ్యర్థులతో ప్రవర్తిస్తున్న తీరు సరికాదని, వెంటనే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఆయన పటాన్చెరు నియోజవర్గంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Last Updated : Jul 17, 2024, 11:58 AM IST