LIVE : కవిత అరెస్ట్ నిరసిస్తూ తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతల ప్రెస్‌మీట్ - ప్రత్యక్షప్రసారం - press meet at Telangana Bhavan
Published : Mar 15, 2024, 8:02 PM IST
|Updated : Mar 15, 2024, 8:12 PM IST
Press Meet at Telangana Bhavan LIVE : కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్టుపై తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భయపెట్టేందుకే కవిత అరెస్ట్ అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పిట్ట బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కవితను రాత్రి 8.45 గంటలకు విమానంలో దిల్లీకి తీసుకెళ్తామన్నారని, ప్రణాళిక ప్రకారమే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, కవిత కోసం విమానం టికెట్ బుక్ చేసి మరీ సోదాలకు వచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే మహిళ అరెస్టు అంశంపై సుప్రీంలో కేసు నడుస్తోందని, సుప్రీం సూచనలనూ పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఈ నెల 19న సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్టు సరికాదన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో సోదాల అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు.
Last Updated : Mar 15, 2024, 8:12 PM IST