రాష్ట్రంలో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారు : రాగిడి లక్ష్మారెడ్డి - Ragidi LaxmaReddy Election Campaign - RAGIDI LAXMAREDDY ELECTION CAMPAIGN
Published : May 2, 2024, 3:50 PM IST
BRS MP Candidate Ragidi Laxma Reddy Election Campaign : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మూడు చింతలపల్లి మండలంలోని ప్రచారంలో లక్ష్మారెడ్డితో పాటు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గెలవబోయేది తమ పార్టీయేనని అని జోస్యం చెప్పారు. కేసీఆర్ హయాంలో కరెంట్ కోతలు, పింఛన్లు నిలిపివేశారా? అని మహిళలను ప్రశ్నించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం శామీర్పేట్ మండలం పొన్నాల గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మూడు చింతలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.