హనుమకొండలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - BRS Party Formation Day Celebration - BRS PARTY FORMATION DAY CELEBRATION
Published : Apr 27, 2024, 3:29 PM IST
BRS Party Formation Day Celebrations in Hanamkonda : హనుమకొండలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బండ ప్రకాష్‌లు పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ కార్యాలయంపైన జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ గులాబీ జెండాను ఎగురవేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. అనేకమందిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి వారి నుంచి ప్రజాసేవ చేయించిందని అన్నారు. అనివార్య కారణాల వల్ల అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ప్రజాసేవ చేస్తుంటారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 23ఏళ్ల ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండ దేశంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పని చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.