తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం - MLA KAUSHIK REDDY LIVE TODAY - MLA KAUSHIK REDDY LIVE TODAY

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 2:00 PM IST

Updated : Sep 13, 2024, 2:25 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పీఏసీ ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులు చేసిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అక్కడ మొదలైన వివాదం రోజురోజుకు ముదిరిపోయింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, దాడులు, ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. అరెకపూడి గాంధీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌తో ఈ వివాదం మొదలైంది. కౌశిక్ సవాల్ స్వీకరించిన గాంధీ స్వయంగా తానే అతడి ఇంటికి వెళ్లి బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయణ్ను అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు. మరోవైపు గాంధీ అనుచరులు తనపై దాడి చేశారంటూ కౌశిక్ ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని, సామాన్య ప్రజలకు ఎవరు రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. కౌశిక్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలంతా ఒక్కటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తడాఖా ఏంటో చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి అరెకపూడికి మరో సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
Last Updated : Sep 13, 2024, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details