LIVE : కేటీఆర్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - KTR Live - KTR LIVE
Published : Apr 6, 2024, 2:02 PM IST
KTR LIVE : బీఆర్ఎస్ నేతలు చేపట్టిన రైతు దీక్షలో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షడు కేటీఆర్ పాల్గోన్నారు. అవసరం లేదని కాంగ్రెస్ ఆలోచన కేసీఆర్ అవినీతి చేశారని చదువురానివాడు కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు. యూట్యాబ్ వీడియోలు కాదు కళ్ల ముందు కనిపిస్తున్న నిజం నమ్మాలని తెలిపారు. నేరవేర్చలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ గురించి అడిగితే సీరియస్‌గా తీసుకోవద్దని సీఎం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. అంతకు ముందు రైతుల ఇబ్బందుల కోసం పంటలను పరిశీలించిన కేసీఆర్ ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు, తెలియదని అన్నారు. కరీంనగర్ జిల్లాలో గత పదేళ్లలో మేము సజీవ జలధారలు సృష్టించామన్నారు. గత ఏడేళ్లు చెక్‌డ్యామ్‌లు నిరంతరం నీళ్లతో కళకళలాడేవని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పొలం బాట(Polam Bata) కార్యక్రమంతో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్లలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.