తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సిద్దిపేటలో హరీశ్​రావు రోడ్ షో - Harishrao Press Meet at siddipet - HARISHRAO PRESS MEET AT SIDDIPET

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 7:46 PM IST

Updated : May 1, 2024, 8:03 PM IST

BRS Leader Harishrao Press Meet : లోక్​సభ ఎన్నికల వేడి రోజురోజుకీ వేసవి వేడిని అధిగమించేస్తోంది. ఒకవైపు అభ్యర్థుల ప్రచారాలు, మరోవైపు పార్టీల స్టార్​ క్యాంపెయినర్స్​, ఇంకోవైపు నేతల ఇంటింటి ప్రచారాలతో తెలంగాణ రాజకీయ రణ రంగంగా మారిపోయింది. ఈ లోక్​సభ ఎన్నికలు చావోరేవో అన్నట్లు ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీనే లోక్​సభ ఎన్నికలో గెలిపించాలని పార్టీల నాయకులు వేడుకుంటున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్​పై ఈసీ 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించడంపై మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతామని భావించి బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ను ఇలా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తప్పించిందని విమర్శలు చేశారు. కాంగ్రెస్​, బీజేపీ రెండూ ఒక్కటైనని అన్నారు. బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.  
Last Updated : May 1, 2024, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details