LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - BRS Foundation Day Celebrations - BRS FOUNDATION DAY CELEBRATIONS
Published : Apr 27, 2024, 9:47 AM IST
|Updated : Apr 27, 2024, 9:56 AM IST
BRS Foundation Day Celebrations Live : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ నేడు 23వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. పార్టీ శ్రేణులంతా కలిసి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వేడుకలు జరుపుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆర్భాటాలు లేకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణను సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతులు, శ్రామికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, వారి అభివృద్ధి కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లోనూ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు.
Last Updated : Apr 27, 2024, 9:56 AM IST