తెలంగాణ

telangana

ETV Bharat / videos

Live : కొత్తగూడెంలో కేసీఆర్ బస్సుయాత్ర - ప్రత్యక్ష ప్రసారం - KCR Road Show In khammam - KCR ROAD SHOW IN KHAMMAM

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 6:35 PM IST

Updated : Apr 30, 2024, 8:20 PM IST

BRS Chief KCR Road Show In khammam Live :  లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో వేగం పెంచాయి. ఊరు వాడా తేడా లేకుండా ప్రచారాల్లో హోరెత్తిస్తున్నాయి. లోక్​సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయఢంకా మోగించాలనే లక్ష్యంతో పార్టీలు ముందుకు వెెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పాల్గొన్నారు. నిన్న ఖమ్మం పట్టణంలో పర్యటించిన గులాబీ బాస్ ఇవాళ కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహించారు. ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. గత ఆరు రోజులుగా కేసీఆర్ పలు నియోజకవర్గాలలో బస్సుయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్​లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల  సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రైతులకు రుణమాఫీ, పింఛన్ల పెంపు, తులం బంగారం తదితర హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందన్నారు. 
Last Updated : Apr 30, 2024, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details