గత ప్రభుత్వ నిర్లక్ష్యం - కూలిపోయిన హెచ్చెల్సీ వంతెన - Bridge Collapsed - BRIDGE COLLAPSED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 11:46 AM IST
Bridge Collapsed in Anantapur District : అనంతపురం జిల్లా కనేకల్ మండలం మాల్యం-నాగేపల్లి గ్రామాల మధ్య హెచ్చెల్సీ కాలువపై ఉన్న వంతెన కుప్పకూలిపోయింది. బోరు లారీ వంతెన దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరో లారీ డ్రైవరు గమనించి బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పిందని తెలియజేశారు. ఈ ఘటనతో కనేకల్ నుంచి బళ్లారికి రాకపోకలు నిలిచిపోయాయి.
Kanekal Hcl Bridge in Anantapur : కనేకల్ హెచ్చెల్సీ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 7 వంతెనలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని శిథిలావస్థలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూలిపోయిన వంతెనలను అప్పటి జగన్ సర్కార్ పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో హెచ్చెల్సీ ఆధునీకరణ పనులకు ఒక పైసా నిధులు విడుదల చేయలేదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నిధులు విడుదల చేయకే ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెనలు ఆధునీకరణ పనులను చేపట్టాలని కోరుకుంటున్నారు.