LIVE : బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం - BJP Working Group Expansion Meeting - BJP WORKING GROUP EXPANSION MEETING
Published : Jul 12, 2024, 12:20 PM IST
|Updated : Jul 12, 2024, 12:49 PM IST
BJP Working Group Expansion Meeting Live : హైదరాబాద్ శంషాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఇందులో పాల్గొన్నారు. రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. బీజేపీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పాలనపై సుదీర్ఘ పోరాటం చేశామన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిపై కాషాయ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. సీఎం సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరిందన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.
Last Updated : Jul 12, 2024, 12:49 PM IST