ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ రాష్ట్ర ఇన్​ఛార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ - BJP State Incharge met Chandrababu - BJP STATE INCHARGE MET CHANDRABABU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 3:48 PM IST

BJP State Incharge Siddharth Nath Singh met Chandrababu: ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్‌ విలవిల్లాడుతుండగా కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్​సభ స్థానాల్లో ఎన్​డీఏ కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో 161 స్థానాల్లో మెజార్టీలో దూసుకెళ్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి క్లీన్​ స్వీప్​ చేయడంపై పలువురు నేతలు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. 

ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసం వద్ద బీజేపీ రాష్ట్ర ఇన్​ఛార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొద్ది సేపట్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు.

టీడీపీ శ్రేణుల సంబరాలు: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​కు పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కార్యాలయం గేటు ముందు టపాసులు కాల్చి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నివాసం వద్ద తెలుగుదేశం శ్రేణులు టపాసులు కాల్చారు. రెండు చోట్లా సంబరాలు అంబరాన్ని అంటాయి.

ABOUT THE AUTHOR

...view details