LIVE : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్మీట్ - ప్రత్యక్ష ప్రసారం - Kishan Reddy Press meet Live - KISHAN REDDY PRESS MEET LIVE
Published : Jul 31, 2024, 3:35 PM IST
|Updated : Jul 31, 2024, 4:17 PM IST
BJP State Chief Kishan Reddy Press Meet Live : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వ రెండు విడతలుగా రైతు రుణమాఫీ చేసింది. రైతు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. మూడు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ నెల 19న మొదటి విడత ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమ చేసింది. ఆధార్ నంబరు, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17 వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Last Updated : Jul 31, 2024, 4:17 PM IST