LIVE : బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మీడియా సమావేశం - BJP MP Raghunandan Rao - BJP MP RAGHUNANDAN RAO
Published : Aug 24, 2024, 2:26 PM IST
|Updated : Aug 24, 2024, 2:36 PM IST
BJP MP Raghunandan Rao Live : హైడ్రా అధికారులు మాదాపూర్‌లో ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన ఘటనపై భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్‌రావు స్పందించారు. ఎన్‌కన్వెన్షన్‌ను కూలగొట్టమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు. దానిని కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించలేదని మండిపడ్డారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా అని విమర్శించారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలుల పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌పై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. దానిని కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించలేదని మండిపడ్డారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా అని విమర్శించారు.
Last Updated : Aug 24, 2024, 2:36 PM IST