సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టుల పట్ల గౌరవం లేదు : ఎంపీ లక్ష్మణ్ - BJP MP LAXMAN FIRES ON CM REVANTH - BJP MP LAXMAN FIRES ON CM REVANTH
Published : Aug 30, 2024, 7:20 PM IST
BJP MP Laxman Slams CM Revanth Reddy : బీజేపీ పట్టణ, అగ్రవర్ణాల పార్టీ అన్న వాళ్లకు చెంపపెట్టులా సభ్యత్వ నమోదు చేయించాలని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్ కమలం శ్రేణులకు పిలుపునిచ్చారు. దక్షిణాదిలో బీజేపీ ఎక్కడని ప్రశ్నిస్తున్న నేతలకు ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను బీజేపీ గెల్చుకుందని చెప్పారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల నుంచి సభ్యత్వం తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకు, బీజేపీకి ముడి పెట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కి కోర్టుల పట్ల గౌరవం లేకుండా, అవమానపరుస్తున్నారన్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు వీడియోలు సృష్టించారని విమర్శించారు.