ముస్లింలకు సమన్యాయం చేయడానికే వక్ఫ్ బిల్లు సవరణ : డీకే అరుణ - MP DK Aruna about Waqf Bill - MP DK ARUNA ABOUT WAQF BILL
Published : Sep 12, 2024, 12:40 PM IST
BJP MP DK Aruna on Waqf Bill : వక్ఫ్ బోర్డుకు సంబంధించి తీసుకొస్తున్న కొత్త చట్టాల పట్ల కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వక్ఫ్ సవరణ బిల్లు జేపీసీ సభ్యురాలు, ఎంపీ డీకే అరుణ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వక్ఫ్ భూ బాధిత రైతులతో మాట్లాడిన ఆమె, ముస్లింలకు సమన్యాయం చేయడానికే చట్టానికి సవరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగానే ఉన్నారని, ఇకపై కూడా ఉంటారని స్పష్టం చేశారు.
ముస్లింల భూములు లాక్కుంటారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. వక్ఫ్ చట్టం ద్వారా పేద ముస్లింలకు న్యాయం జరగాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలోనూ వక్ఫ్ చట్టానికి ఎన్నోసార్లు సవరణలు జరిగాయని చెప్పారు. దేశంలో శతాబ్దాలుగా అందరం కలిసే ఉంటున్నామని, ఎవరికీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. సవరణ వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెబుతున్న డీకే అరుణతో ముఖాముఖి.