ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే జగన్ సొంత చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు : సత్యకుమార్‌ - Satyakumar on YS Viveka Murder Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 6:56 PM IST

BJP Leader Satyakumar Fire on CM Jagan : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత అన్నారు. న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు. ఈ సందర్భంగా  హత్యా రాజకీయాలు ఉండకూడదని, తన అన్న పార్టీ వైఎస్సార్సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత సత్యకుమార్‌ ట్విటర్​(X) వేదికగా స్పందిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు.

BJP Leader Satyakumar About YS Viveka Murder Case : మాట్లాడితే చాలు నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేకపోయారని సత్యకుమార్‌  విమర్శించారు. అధికారం చేపట్టి ఐదు సంవత్సరాలైనా మాజీ  వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిందెవరో తేల్చలేకపోతున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థల విచారణను అడ్డుకుని నిందితులను కాపాడుతున్న జగన్‌ తీరు చూసి వైఎస్సార్సీపీకి ఓటు వేయొద్దని బాబాయి కుమార్తే వైఎస్ సునీత చెబుతోందని సత్యకుమార్ అన్నారు. తన తండ్రి మరణంపై ప్రజాకోర్టే తీర్పు ఇవ్వాలని సునీత కోరుతున్నారని తెలిపారు. జగన్‌ పాత్రపైనే విచారించాలని సునీత అడుగుతున్నారంటే, వారి కుటుంబంలో జగన్‌పై నమ్మకం, విలువ ఎంతో అందరికీ అర్థమవుతుందని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details