ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎస్ జవహర్ రెడ్డిని తొలగించి ఒత్తిళ్లకు లొంగని అధికారిని నియమించాలి: లంకా దినకర్ - lanka dinakar on cs jawahar reddy - LANKA DINAKAR ON CS JAWAHAR REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 4:49 PM IST

Lanka Dinakar Comments on CS Jawahar Reddy: సీఎస్ జవహర్ రెడ్డిని తొలగించి, ఆస్థానంలో ఏ ఒత్తిళ్లకు లొంగని ఐఏఎస్ అధికారిని నియమించాలని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి ఐఏఎస్​లా కాకుండా ముఖ్యమంత్రి దగ్గర అయ్యా ఎస్ అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాష్ట్రంలో సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా, పంపిణీ చేయకుండా 33 మంది మృతికి రాష్ట్ర ప్రభుత్వం కారణమైందని విమర్శించారు. ఆ మృతులు ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తామని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎస్​ను తొలగిస్తే తప్ప సక్రమంగా ఎన్నికలు జరగవని ఆరోపించారు. డీజీపీ, ఇంటిలిజెన్స్ అధిపతి అసమర్థంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సీఎస్​ను, డీజీపీని, ఇంటిలిజెన్స్ చీఫ్​ను తొలగించి సమర్థులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు.

Purandeswari Nomination AP Elections 2024: శుక్రవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్​లో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1:10 గంటలకు రాజమహేంద్రవరంలోని పురందేశ్వరి నివాసం నుంచి ర్యాలీగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి 2:20 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ మహిళా నేత కుష్బూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్ర బీజేపీ నేతలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు పాల్గొంటారన్నారు.

ABOUT THE AUTHOR

...view details