ఒక వర్గానికి చెందిన ఇళ్లు కూల్చడమే ఎజెండాగా పెట్టుకున్నారు : మహేశ్వర్ రెడ్డి - BJP Alleti Maheshwar Comments - BJP ALLETI MAHESHWAR COMMENTS
Published : Aug 29, 2024, 6:51 PM IST
BJP Leader Alleti Maheshwar Reddy Comments On Hydra : బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ఒక వర్గానికి చెందిన ఇళ్లు కూల్చడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాజకీయాలు మాట్లాడుతున్న రంగనాథ్, ఖాకీ దుస్తులు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలని హితవు పలికారు. ఆయన పోలీస్ నియమ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పదోన్నతి హామీతో రంగనాథ్ పని చేస్తున్నారా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రంగనాథ్ వ్యక్తిగతంగా తమను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒవైసీ కనుసైగల్లో నడుస్తోందనే అనుమానం కలుగుతుందన్నారు. ఒవైసీ విద్యా సంస్థలకు ఇచ్చిన మినహాయింపు, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలకు వర్తించదా? అని ప్రశ్నించారు. సల్కం చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాతే మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలన్నారు. పాతబస్తీలోని చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.