మురికివాడను సందర్శించిన బిల్‌గేట్స్- ప్రజల యోగక్షేమాలపై ఆరా! - bill gates bhubaneswar
Published : Feb 28, 2024, 4:01 PM IST
Bill Gates visits slum in Odisha : ఒడిశాలోని ఓ మురికివాడను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సందర్శించారు. బుధవారం ఉదయం బిల్‌గేట్స్ ఒడిశా ప్రభుత్వ అధికారులతో కలిసి భువనేశ్వర్‌లోని మామంగ్ల బస్తీలో పర్యటించారు. బిజూ ఆదర్శ కాలనీ వాసులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే స్వయం సహాయక సంఘాల మహిళలతో సంభాషించారు.
మురికివాడల్లో తీసుకొచ్చిన మార్పులను బిల్‌గేట్స్‌కు దగ్గరుండి చూపించినట్లు ఒడిశా రాష్ట్ర డెవలప్మెంట్ కమిషనర్ అనుగార్గ్ చెప్పారు. మురికివాడల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై బిల్‌గేట్స్ ప్రశంసించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కాలనీ వాసులతో బిల్‌గేట్స్ మాట్లాడినట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జీ మతి వతనన్ చెప్పారు. ఆ పథకాల వల్ల ఏమైనా మార్పులు వచ్చాయని బిల్‌గేట్స్ అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అనంతరం మంగళవారం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించిన మిషన్ శక్తి బజార్‌ను సందర్శించారు. ఆ బజార్ గురించి అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.