తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బొల్లారం రాష్ట్రపతి నిలయంలో 'భారతీయ కళా మహోత్సవ్​-2024' కార్యక్రమం - Bharatiya Kala Mahotsav 2024 live - BHARATIYA KALA MAHOTSAV 2024 LIVE

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 5:14 PM IST

Updated : Sep 28, 2024, 5:55 PM IST

Bharatiya Kala Mahotsav 2024 Live : సికింద్రాబాద్​ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్​-2024 కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. నేటి నుంచి ఈ భారతీయ కళా మహోత్సవాలు అక్టోబరు 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతితోపాటు పది మంది పైగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టేలా రాష్ట్రపతి సమక్షంలో కళాకారులు నృత్య, కళారూపాలు ప్రదర్శించారు. ప్రత్యేకించి ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ 400 మంది హస్తకళల కళాకారులు, 300 మంది చేనేత కుటుంబాలు రూపొందించిన ఉత్పత్తులు ప్రదర్శించడంతో పాటు సేంద్రీయ ఆహారోత్పత్తులు విక్రయాలు కూడా ఉన్నాయి. ఈశాన్య భారతం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కింద, త్రిపుర వంటి 8 రాష్ట్రాల నుంచి చేతి వృత్తులు, హస్త కళలు, చేనేత కుటుంబాలు, యువత పాల్గొని తమ సంస్కృతి, సంప్రదాయాలతోపాటు పర్యాటక ప్రాశస్త్యం, సత్తా చాటుతున్నారు.
Last Updated : Sep 28, 2024, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details