బిల్వసర్గం గుహలకు వెళ్లాలంటే మీ ఒళ్లు హూనం అయినట్లే! ఈ దారి- గుంతల దారి
By ETV Bharat Andhra Pradesh Team
Published : 18 hours ago
|Updated : 17 hours ago
Betamcherla Road Problems : ఆ రహదారిలో ప్రయాణించాలంటే దుమ్ములో మునిగి తేలాల్సిందే! ఆటోలు, బస్సులు రాని ఆ మార్గంలో ప్రయాణం నరకప్రాయమే! రోడ్డు వేయడానికి మూడున్నర కోట్లతో రెండుసార్లు టెండర్లు పిలిచినా మార్గం సుగమం కాలేదు. వైఎస్సార్సీపీ హయాంలో రహదారి పనుల్లో భాగంగా ఒకవైపు రక్షణ గోడ నిర్మించారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు. ఫలితంగా ఐదేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.
ఈ రోడ్డుపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇక రాత్రిపూట ప్రయాణం ఓ సాహసమే! నంద్యాల జిల్లా బేతంచెర్ల నుంచి కేకే కొట్టాల, రామకృష్ణాపురం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్వసర్గం గుహలకు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగించాలి. వర్షాకాలంలో కొండల్లోంచి బండరాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. దీనికి తోడూ రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వమైనా స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తున్న కథనం.