ఐర్లాండ్‌లో తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు - BATHUKAMMA FESTIVAL IN IRELAND
Published : Oct 9, 2024, 11:21 AM IST
Bathukamma Celebrations in Ireland : ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు (Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డబ్లిన్ నగరంలో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకున్నారు. గత 12 ఏళ్లుగా ఈ బతుకమ్మ వేడుకలను వాలంటీర్లు జరుపుతున్నారు. ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 900 మంది హాజరయ్యి సరదాగా గడిపారు. మహిళలు బతుకమ్మ కోలాటం, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు.
పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమాన్న ప్రారంభించారు. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలనే లక్ష్యంతో (Telanganites Of Ireland) తెలంగాణాటీస్ ఆఫ్ ఐర్లాండ్ వారు యేటా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో చిన్న పిల్లలకు వినోదంగా మేజిక్ షో సైతం ఏర్పాటు చేశారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ఆడపడుచులకు బహుమతులు ప్రధానం చేశారు.