LIVE : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు - Telangana Bathukamma Celebrations - TELANGANA BATHUKAMMA CELEBRATIONS
Published : Oct 2, 2024, 6:31 PM IST
|Updated : Oct 2, 2024, 9:24 PM IST
Bathukamma Celebrations In Telangana 2024 : తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. బతుకమ్మ పండుగలో మొదటిరోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఆహ్లాదంగా సాగుతున్నాయి. అన్ని జిల్లాలోని ఊరూ వాడా రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో, ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళామణుల పండుగగా పిలుచుకోనే బతుకమ్మలో సందడిగా ఆడిపాడుతున్నారు. బతుకమ్మ పండుగలో మొదటిరోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఆహ్లాదంగా సాగుతున్నాయి. తీరొక్క పూలతో అందంగా తీర్దిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. తెలంగాణలో మహిళలకు మహా ఇష్టమైన పండుగ బతుకమ్మ వేడుక. ఆదిపరాశక్తిని అరవిరిసిన సుమాల్లో దర్శిస్తూ, పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతారు. 9 రోజుల ఈ వేడుకలో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి. బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక 'శక్తి ఉపాసన'గా, ఆత్మచైతన్యానికి మేల్కొలుపుగా భావిస్తారు.
Last Updated : Oct 2, 2024, 9:24 PM IST