తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైభవంగా ముగిసిన బాలాపూర్ మహాగణపతి నిమజ్జనం - Balapur Ganesh Immersion 2024

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 7:35 PM IST

Balapur Ganesh Immersion 2024 : హైదరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా సాగింది. 11 రోజులు ఘనంగా పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. సాయంత్రం 4.30 గంటలకు బాలాపూర్ మహా గణపతి నిమజ్జనం పూర్తైంది. ఈ మహాగణపతిని ట్యాంక్‌బండ్‌ వద్ద 12వ నంబర్‌ క్రేన్​పై ఉంచి నిమజ్జనం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి గణనాథుని శోభ యాత్రలో పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.  

బాలాపూర్ గణపతి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది లడ్డూ. ఉదయం లడ్డూ వేలంపాట అనంతరం లంబోదరుడు నిమజ్జన శోభ యాత్రకు బయలుదేరారు. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఓ చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సారి లడ్డూ వేలం పాటలో చిన్న మార్పులు చేశారు. కొంత నగదు డిపాజిట్ చేసిన వారికే లడ్డు వేలం పాటు పాడే అవకాశం కల్పించారు. కాగా ఈ సారి బాలాపూర్ లడ్డూను ఈసారి 30 లక్షల వేయి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details